గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం

న్యూఢిల్లీ : ఓ వ్యక్తిని చంపి, అతడి శవంతో కామవాంఛ తీర్చుకున్నారు ఇ‍ద్దరు మానవ మృగాళ్లు. వారి మధ్య గొడవ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్‌ సరై ఏరియాలో ఉంటున్నారు. వారికి అదే ప్రాంతంలో ఉంటున్న బాధితుడితో పరిచయం ఏర్పడింది. మంగళవారం రాత్రి వారు బాధితుడి ఇంట్లో మందు పార్టీ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అతడితో వారికి గొడవ ఏర్పడింది. ఆగ్రహానికి గురైన వారు అతడ్ని గొంతునులిమి చంపేశారు. అనంతరం శవంతో తమ కామ వాంఛ తీర్చుకున్నారు.