కేజీఎఫ్‌ 2 : డేట్‌ గుర్తుపెట్టుకోండి

కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్‌-2’.  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీరా’ పాత్రలో నటిస్తుండగా, రవీనాటండన్‌ ‘రమికా సేన్‌’ అనే పాత్రలో కనిపించనుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం శుక్రవారం వెల్లడించింది. కేజీఎఫ్‌-2ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2018లో వచ్చిన కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌) తొలి భాగం సూపర్‌ డూపర్‌ హిట్టైన విషయం తెలిసిందే. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అయింది.